నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు తీర్పును అడ్డుకోవడం సరికాదు: ఎంపీ కనకమేడల

  • న్యాయ సలహాదారుగా ఉండి తీర్పును ఏజీ వక్రీకరించడం సరికాదు 
  • ఏజీ శ్రీరాం మీడియా సమావేశం ఎలా నిర్వహిస్తారు?
  • కావాలంటే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు వెళ్లొచ్చు కదా? 
  • ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ పునర్నియామకం జరిగినట్లే
నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు తీర్పును అడ్డుకోవడం సరికాదని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు.  ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయ సలహాదారుగా ఉండి ఏజీ శ్రీరాం తీర్పును వక్రీకరించడం సరికాదని ఆయన చెప్పారు. ఏజీ శ్రీరాం మీడియా సమావేశం ఎలా నిర్వహిస్తారు? అని ఆయన ప్రశ్నించారు.

శ్రీరాం మీడియా సమావేశం నిర్వహించడం విచిత్రంగా ఉందని, కావాలంటే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు వెళ్లొచ్చు కదా? అని కనకమేడల అన్నారు. ఆర్డినెన్స్ చెల్లదని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందని, తీర్పు సరిగా లేదనడం సరికాదని ఆయన అన్నారు. ఏజీ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకం జరిగినట్లేనని స్పష్టం చేశారు.


More Telugu News