కరోనాపై మా వ్యాక్సిన్ తో 99 శాతం సత్ఫలితం: చైనా సంస్థ సినోవాక్

  • కోతులపై విజయవంతమైన 'కరోనా వాక్'  
  • మానవులపై పరీక్ష కోసం 1000 మంది సిద్ధం
  • ఒకేసారి 10 కోట్ల వాక్సిన్ డోస్ లు ఇస్తామన్న సినోవాక్
తమ సంస్థ తయారు చేసిన కరోనా వాక్సిన్ 'కరోనా వాక్' 99 శాతం సత్ఫలితాలను అందిస్తుందని చైనాకు చెందిన బయో ఫార్మాస్యుటికల్ సంస్థ సినోవాక్ ప్రకటించింది. ఈ వాక్సిన్ కోతులపై సమర్థవంతంగా పని చేసిందని సంస్థ వెల్లడించింది. ఇది కరోనా వైరస్ ను అడ్డుకుందని, ఇప్పటికే రెండు దశల్లో పరీక్షలను పూర్తి చేసుకుందని, తదుపరి మానవులపై పరీక్షల కోసం 1000 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని పేర్కొంది.

తదుపరి దశ పరీక్షలను యూకేలో చేపట్టనున్నామని, ఇందుకోసం ఆయా దేశాల ప్రభుత్వాలతో చర్చలు కూడా ప్రారంభించామని సినోవాక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఏక కాలంలో 10 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను తయారు చేసే ఏర్పాట్లలో ఉన్నామని తెలిపింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే, కరోనా వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉన్న వృద్ధులు తదితరులకు వాక్సిన్ తొలుత అందిస్తామని పేర్కొంది. అయితే, ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నందున, వాటి ఫలితాలు పూర్తిగా వచ్చేంత వరకూ వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు లేవని తెలియజేసింది.


More Telugu News