ఎస్ఈసీ నిమ్మగడ్డ వివాదంలో మరిన్ని మలుపులు, దాగుడు మూతలు అవసరమా?: దేవినేని ఉమ
- ఉన్నత న్యాయస్థానం తీర్పుతో సర్కారు ఆటలా?
- పేరు లేకుండానే ఫైలు నడిపారు
- జీవో ఫైలుకు ఆమోదం ఉందా?
- కొత్త సంప్రదాయాలకు తెరలేపారు
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు స్పందిస్తూ ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై మండిపడ్డారు. కోర్టులతో ఆటలాడుతున్నారని ఆయన విమర్శించారు.
'ఎస్ఈసీ వివాదంలో మరిన్ని మలుపులు దాగుడు మూతలు అవసరమా? ఉన్నత న్యాయస్థానం తీర్పుతో సర్కారు ఆటలా? పేరు లేకుండానే ఫైలు నడిపారు. జీవో ఫైలుకు ఆమోదం ఉందా? కొత్త సంప్రదాయాలకు తెరలేపారు. ప్రజాహితం లేని ఆర్డినెన్స్ జారీలో లోపాలకు సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు' అని ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పలు పత్రికల్లో వచ్చిన కథనాలను పోస్ట్ చేశారు.