చరిత్రాత్మక ఘట్టం... ఆస్ట్రోనాట్స్ ను స్పేస్ లోకి తీసుకెళ్లిన ప్రైవేటు సంస్థ... వీడియో!
- నిన్న రాత్రి యూఎస్ లో రాకెట్ ప్రయోగం
- నేడు అంతరిక్ష కేంద్రానికి చేరనున్న వ్యోమగాములు
- తన కల సాకారమైందన్న ఎలాన్ మస్క్
నాసాకు చెందిన ఇద్దరు వ్యోమగాములను ప్రపంచ చరిత్రలో తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ అంతరిక్ష కేంద్రానికి చేర్చింది. నిన్న రాత్రి యూఎస్ లోని కాలిఫోర్నియాలో ఉన్న హౌథ్రోన్ లోని స్పేస్ ఎక్స్ మిషన్ కంట్రోల్ సెంటర్ నేతృత్వంలో సీనియర్ వ్యోమగాముులు రోబర్ట్ బెన్ కెన్, డగ్లస్ హర్లీలు, రెండు దశల ఫాల్సన్ 9 రాకెట్ లో అంతరిక్షంలోకి వెళ్లారు. నాసా తరఫున ప్రైవేటు సంస్థ స్పేస్ ఎక్స్ ఈ రాకెట్ ను ప్రయోగించింది. మూడు రోజుల క్రితం వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఇదే ప్రయోగం వాయిదా పడిన సంగతి తెలిసిందే.
మొత్తం 19 గంటల పాటు ప్రయాణాన్ని కొనసాగించనున్న వ్యోమగాములు, ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలో వేచి చూస్తున్న ఇద్దరు రష్యా, ఒక అమెరికన్ ఆస్ట్రోనాట్స్ ను నేడు కలుసుకోనున్నారు. ఈ ప్రయోగంతో అంతరిక్షానికి వాణిజ్య సేవలను ప్రారంభించినట్లయిందని స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. తన కల నిజమైందని ఆయన అన్నారు.
కాగా, 'డెమో-2' అనే పేరుతో ఈ రాకెట్ ప్రయోగం జరిగింది. స్పేస్ ఎక్స్ తయారుచేసిన డ్రాగన్ క్యాప్స్యూల్ కు నాసా సర్టిఫికెట్ లభించిన తరువాత, ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక ఈ రాకెట్ ద్వారా అంతరిక్షానికి చేరుకున్న వ్యోమగాములు, నేటి రాత్రి 8 గంటల సమయంలో స్పేస్ స్టేషన్ కు చేరనున్నారు. అక్కడ వీరికి స్వాగతం పలికేందుకు యూఎస్ ఆస్ట్రోనాట్ క్రిస్ కాసిడీ, రష్యాకు చెందిన కాస్మోనాట్స్ అనతులీ ఇవానిషిన్, ఐవాన్ వాంగర్ లు సిద్ధంగా ఉన్నారు.