క్రికెట్ మారిపోబోతోంది: సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు!

  • ప్రపంచానికే షాకిచ్చిన కరోనా
  • వ్యాక్సిన్ వచ్చేంత వరకూ పరిస్థితి ఇంతే
  • ఆటగాళ్లకూ పరీక్షలు తప్పవన్న గంగూలీ
కరోనా మహమ్మారితో ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్ నకు గురైందని అభిప్రాయపడ్డ టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, అన్ని రంగాల మాదిరిగానే, ఇకపై క్రికెట్ కూడా మారిపోబోనుందని వ్యాఖ్యానించారు. కరోనాకు వ్యాక్సిన్ లేదా మెడిసిన్ వచ్చేంత వరకూ పరిస్థితి ఇలానే ఉంటుందని, ఆ తరువాత మాత్రం సాధారణ స్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు.

క్రికెట్ షెడ్యూల్స్ లో మార్పులు ఉంటాయని, ఐసీసీతో కలిసి క్రికెట్ ను సాధారణ స్థితికి తీసుకుని వస్తామని, క్రికెట్ చాలా శక్తిమంతమైన ఆటని, ఆటగాళ్లకు కూడా కొన్ని పరీక్షలు తప్పవని వ్యాఖ్యానించారు. భారతీయుల్లో ప్రతిఘటించే శక్తి అధికమని, ప్రస్తుతానికి ఔషధాలు లేకున్నా, అతి త్వరలోనే కరోనాకు వాక్సిన్ వస్తుందన్న నమ్మకం ఉందని గంగూలీ వ్యాఖ్యానించారు. తన చిన్న వయసులో ఫుట్ బాల్ గేమే జీవితంగా గడిపానని, అనుకోకుండా క్రికెటర్ గా మారానని చెప్పిన గంగూలీ, చిన్న వయసులో ఒడిశాపై చేసిన శతకం, లార్డ్స్ మైదానంలో చేసిన సెంచరీ, తనకు మధుర స్మృతులని చెప్పుకొచ్చారు.


More Telugu News