నిమ్మగడ్డ కేసులో మరో ట్విస్ట్.. బాధ్యతలు స్వీకరించినట్టు ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి
- హైకోర్టు తీర్పుతో బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు ఉత్తర్వులు
- తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామన్న ఏజీ
- ఆ తర్వాత కాసేపటికే ఉపసంహరణ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో మరో ట్విస్ట్ చేటుచేసుకుంది. హైకోర్టు తీర్పుతో ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టినట్టు ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నట్టు ఎన్నికల కమిషన్ కార్యదర్శి ప్రకటించారు. శుక్రవారం జారీ చేసిన సర్క్యులర్ 317ను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.
అంతకుముందు ఏజీ ఎస్.శ్రీరాం మాట్లాడుతూ నిమ్మగడ్డ స్వీయ పునరుద్ధరణ చెల్లదని అన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత కాసేపటికే ఎస్ఈసీ కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ నుంచి మరో సర్క్యులర్ వెలువడింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్‌ఈసీగా మళ్లీ బాధ్యతలు స్వీకరించినట్టు జారీ చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇదే స్థితి కొనసాగుతుందని పేర్కొనడం గమనార్హం.