కాస్త ముందే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు... జూన్ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశం!
- కేరళలో రుతుపవనాల ప్రభావం
- జూన్ 9,10 తేదీల్లో తెలుగు రాష్ట్రాలకు చేరిక
- దక్షిణ తమిళనాడు నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి
- నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు
దేశంలో అత్యధిక వర్షపాతానికి కారణమయ్యే నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. జూన్ 1న కేరళను తాకుతాయని వాతావరణ విభాగం ప్రకటించగా, రెండ్రోజుల ముందే కేరళను తాకాయి.
అయితే అరేబియా సముద్రంలో అల్పపీడనం పరిస్థితులు ఉన్నందున ఇవి దేశంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు సమయం పడుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ చెబుతోంది. జూన్ 9, 10 తేదీల్లో నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశిస్తాయని అంచనా వేశారు. కాగా, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మాత్రం కేరళకు జూన్ 5న నైరుతి రుతుపవనాలు వస్తాయని, ఈసారి ఆలస్యంగా వస్తున్నాయని పేర్కొంది.
అటు, దక్షిణ తమిళనాడు నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ విభాగం పేర్కొంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది.