గ్యాస్ లీకేజికి కారణమైన వారిపై చర్యలు తీసుకునే దమ్ముందా?: సీఎం జగన్ కు లోకేశ్ సవాల్
- గ్యాస్ లీక్ బాధితులపైనే కేసులు పెట్టారంటూ ఆగ్రహం
- గ్యాస్ లీక్ ఘటన కారకులతో మంతనాలు జరిపారని ఆరోపణ
- ఏడాదిపాటు సామూహిక విధ్వంసం సృష్టించారంటూ ట్వీట్
సీఎం జగన్ ఏడాది పాలన నేపథ్యంలో టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. ఏడాదిపాటు సామూహిక విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. ఏపీని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో బాధితులు ఆసుపత్రిలో ఉంటే, గ్యాస్ లీకేజికి కారణమైన వారితో మంతనాలు జరిపారంటూ ఆరోపించారు. ఈ వ్యవహారంలో బాధితులపైనే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ లీకేజికి కారణమైన వారిపై చర్యలు తీసుకునే దమ్ముందా? అంటూ సీఎం జగన్ కు సవాల్ విసిరారు.