టిక్‌టాక్ మోజులో ఐదుగురు బాలుర మృతి
- వారణాసిలో ఘటన
- గంగానదిలోకి దిగిన బాలురు
- లోతు తెలియక మునిగిన ఓ బాలుడు
- కాపాడే క్రమంలో మరో నలుగురి మృతి
టిక్‌టాక్ మోజు ఐదుగురు బాలుర ప్రాణాలను తీసింది. టిక్‌టాక్ వీడియో కోసం గంగానదిలో దిగిన ఐదుగురు బాలురు మృతి చెందిన ఘటన వారణాసిలో చోటు చేసుకుంది. నీటిలోకి ముందుగా కొందరు విద్యార్థులు దిగగా ఒడ్డున నిలబడి ఒకరు వీడియో తీశారు. అయితే, నదిలోతు తెలియని ఓ బాలుడు ఒక్కసారిగా అందులో మునిగిపోయాడు.
అతడిని కాపాడే క్రమంలో మిగతా నలుగురు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూ నదిలో మునిగి మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం వారి మృతదేహాలను రామ్‌నగర్‌లోని లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించారు. మృతుల పేర్లు తౌసిఫ్, ఫదీన్, సైఫ్, రిజ్వాన్ ,సకీ అని పోలీసులు తెలిపారు. వారంతా 14 నుంచి 19 ఏళ్ల మధ్య బాలురేనని అన్నారు.