పోలవరం, సాగు నీటి ప్రాజెక్టులు పండబెట్టేశారు: దేవినేని ఉమ

  • ఏడాది పాలనలో 87 వేల కోట్ల రూపాయల అప్పు
  • రెవెన్యూ లోటు70 వేల కోట్ల రూపాయలు
  • కట్టిన ఇళ్లు-సున్నా, వచ్చిన పరిశ్రమలు-సున్నా
  • ప్రజా రాజధానిని  ఆపేశారు
వైఎస్ జగన్ గారి ఏడాది పాలన గురించి స్పందించిన టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. 'మీ ఏడాదిపాలనలో 87 వేల కోట్ల రూపాయల అప్పు, రెవెన్యూ లోటు 70 వేల కోట్ల రూపాయలు. కట్టిన ఇళ్లు-సున్నా, వచ్చిన పరిశ్రమలు-సున్నా. ప్రజా రాజధానిని  ఆపేశారు. పోలవరం, సాగునీటి ప్రాజెక్టులు పండబెట్టేశారు. బడ్జెట్ సొమ్ములు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పండి జగన్ గారూ' అని దేవినేని ఉమ నిలదీశారు.

జగన్ ఏడాది పాలన సందర్భంగా పలు పత్రికల్లో వచ్చిన కథనాలను ఆయన పోస్ట్ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ వ్యవహారంతో పాటు హైకోర్టు పలు విషయాల్లో ఇచ్చిన తీర్పులు, జగన్‌కు ఎదురైన షాక్‌లు అందులో ఉన్నాయి.



More Telugu News