శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం.. పిడుగుపాటుకు నలుగురి బలి
- ఉరుములు, మెరుపులతో వర్షం
- వంగర మండలంలో ముగ్గురి మృతి
- సీతం పేట మండలంలో మరొకరు మృత్యువాత
శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ పిడుగులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో పిడుగులు పడడంతో నలుగురు మరణించారు. వంగర మండలంలో ముగ్గురు మరణించగా, సీతంపేట మండలంలో మరొకరు మృత్యువాత పడ్డారు. వంగర మండలంలో మరణించిన వారిలో అచ్యుతరావు అనే పదో తరగతి విద్యార్థి కూడా ఉన్నాడు. మరో ఇద్దరు పశువులను మేపడానికి వెళ్లి పిడుగుపాటుకు బలయ్యారు. వీరు ముగ్గురూ పేదవాళ్లని, ప్రభుత్వమే వారి కుటుంబాలను ఆదుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు.