ఈసారి వలస కార్మికుల కోసం ఏకంగా విమానం ఏర్పాటు చేసిన సోనూ సూద్
- లాక్ డౌన్ కాలంలో పెద్ద మనసు చూపుతున్న సోనూ సూద్
- ఇప్పటికే బస్సుల ద్వారా వేలమంది వలస జీవుల తరలింపు
- కొచ్చిలో చిక్కుకుపోయిన 177 మంది ఒడిశా మహిళా కార్మికులు
- స్నేహితుడి ద్వారా వారి గురించి తెలుసుకున్న సోనూ
ప్రముఖ నటుడు సోనూ సోద్ ఉదార స్వభావానికి ఎల్లలు లేకుండా పోతోంది. ఇటీవల వేలమంది వలస కార్మికుల కోసం పెద్ద ఎత్తున బస్సులు ఏర్పాటు చేసి ఆ అభాగ్యుల ముఖాల్లో ఆనందం చూసిన సోనూ సూద్, ఈసారి విమానం ఏర్పాటు చేశారు. కేరళలో చిక్కుకుపోయిన 177 మంది మహిళా వలసజీవులను ఒడిశా తరలించేందుకు సోనూ ఈ పర్యాయం వాయు మార్గాన్ని ఎంచుకున్నారు.
ఒడిశాకు చెందిన ఆ మహిళలంతా కొచ్చిలోని ఓ ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. అయితే లాక్ డౌన్ ప్రకటించడంతో ఉపాధి లేక, తినడానికి ఆహారం దొరక్క తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. భువనేశ్వర్ లోని ఓ స్నేహితుడి ద్వారా ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్ వెంటనే చార్టర్డ్ ఫ్లయిట్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు కొచ్చి, భువనేశ్వర్ విమానాశ్రయాలు తెరిచి ఉంచడం కోసం అనుమతులు తీసుకున్నారు.