మిడతల ముప్పుపై సీఎం జగన్ కు లేఖ రాసిన నారా లోకేశ్
- పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చిన మిడతలు
- తెలంగాణ దిశగా వస్తున్నట్టు వార్తలు
- ఏపీ ప్రభుత్వ సన్నద్ధతపై నారా లోకేశ్ లేఖాస్త్రం
పాకిస్థాన్ వైపు నుంచి వస్తున్న రాకాసి మిడతలు భారత్ లోనూ తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అసలే కరోనాతో వేగలేకపోతుంటే, ఇప్పుడీ మిడతలు వచ్చిపడ్డాయి. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో కలకలం రేపిన మిడతలు తెలంగాణ దిశగా వస్తున్నట్టు సమాచారం ఉంది. ఏపీలోనూ ఆ మిడతలు రావొచ్చని భావిస్తున్నారు.
దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. మిడతల ముప్పును నివారించడంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలంటూ లేఖలో పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో మిడతలు ప్రవేశించాయనే వార్తలు రైతులను భయాందోళనలకు గురిచేస్తున్నాయని తెలిపారు. ముంచుకొస్తున్న ప్రమాద నివారణకు ప్రభుత్వ సన్నద్ధత ఎలా ఉంది? అని ప్రశ్నించారు. వ్యవసాయశాఖను అప్రమత్తం చేసి రైతులకు ముందస్తు సూచనలు ఇవ్వాలని వివరించారు.