ఎవరికీ దక్కని అదృష్టం నాకు లభించిందని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు: సీఎం కేసీఆర్

  • కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో జలకళ
  • సిద్ధిపేటలో కేసీఆర్ సభ
  • కొందరికి అరుదైన అవకాశాలు వస్తాయని వెల్లడి
  • బతికుండగానే ఉద్యమ ఫలితాన్ని చూడగలిగానని వ్యాఖ్యలు
కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు విడుదల చేసిన అనంతరం సీఎం కేసీఆర్ సిద్ధిపేటలో రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడారు.  నదీ జలాల తెలంగాణ, ధాన్యరాశుల తెలంగాణ అంటూ గతంలో కొందరు కవులు తెలంగాణను కీర్తించి

న వైనాన్ని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "జీవితంలో కొందరికి చాలా అరుదైన అవకాశాలు వస్తాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన విషయాలు నా జీవితంలో ప్రత్యేకం. ఆయనేం చెప్పారంటే... 'చాలామంది ఉద్యమాలు ప్రారంభిస్తారు. వాళ్లు మధ్యలోనే చచ్చిపోతే వేరే వాళ్ల నాయకత్వంలో ఫలితాలు వస్తాయి. కానీ చంద్రశేఖర్ రావు నువ్వు అలా కాదు, తెలంగాణ ఉద్యమం నువ్వే ప్రారంభించావు, నువ్వు బతికుండగానే తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్నావు. ఎవరికీ దక్కని అదృష్టం నీకు లభించింది' అని అన్నారు" అంటూ కేసీఆర్ వివరించారు.


More Telugu News