మరోసారి జగన్‌ గారు.. విజయసాయిరెడ్డి గారు జైలుకి వెళ్లడం ఖాయం: బుద్ధా వెంకన్న

  • హైకోర్టు తీర్పు నియంతపాలనకి చెంపపెట్టు
  • కరోనా నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోరి ఎన్నికలు వాయిదా వేశారు
  • నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గారికి న్యాయం జరిగింది
  • మేమింతే అంటే జగన్‌కి మంచిదికాదు
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారని ఏపీ  హైకోర్టు  తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ.. హైకోర్టు తీర్పు నియంతపాలనకి చెంపపెట్టు. కరోనా నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోరి ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గారికి న్యాయం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వ ఆలోచనా ధోరణిలో మార్పువస్తుంది అని ఆశిస్తున్నా' అని అన్నారు.

'మీకు అధికారం కట్టబెట్టింది అభివృద్ధి చేస్తారని, అరాచకం సృష్టిస్తారని కాదు. మేమింతే అంటే మరోసారి జగన్‌ గారు, విజయసాయిరెడ్డి గారు జైలుకి వెళ్లడం ఖాయం' అని బుద్ధా వెంకన్న అన్నారు. హైకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. జగన్‌ ఇకపైనైనా తన తీరును మార్చుకోవాలని ఆయన సూచించారు.

హైకోర్టు తీర్పుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీవోలను కోర్టు కొట్టేయడం హర్షణీయన్నారు. నామినేషన్ల నుంచి ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని కోరుతున్నానని చెప్పారు.


More Telugu News