రాజ్యసభ సభ్యుడు, ‘మాతృభూమి’ ఎండీ వీరేంద్రకుమార్ కన్నుమూత

  • కార్డియాక్ అరెస్టుతో కన్నుమూసిన వీరేంద్ర కుమార్
  • కేంద్రమంత్రిగానూ పనిచేసిన వీరేంద్ర
  • సంతాపం తెలిపిన ఉప రాష్ట్రపతి
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజ్యసభ సభ్యుడు, మాతృభూమి మలయాళ దినపత్రిక ఎండీ వీరేంద్ర కుమార్ (84) కన్నుమూశారు. కోజికోడ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నిన్న కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఉదయం 11 గంటలకు ఆయన మృతదేహాన్ని వయనాడుకు తీసుకురానున్నారు. సాయంత్రం ఐదు గంటలకు కల్పేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

వీరేంద్ర కుమార్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. 1987-91 మధ్య వీరేంద్రకుమార్ కేరళ ఎమ్మెల్యేగా పనిచేశారు. 1996లో కోజికోడ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కార్మిక, ఆర్థిక శాఖల సహాయమంత్రిగానూ వీరేంద్రకుమార్ పనిచేశారు. అనంతరం మాతృభూమి దినపత్రికను స్థాపించారు. వీరేంద్ర కుమార్ మృతికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. వీరేంద్ర కుమార్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, అనుభవజ్ఞుడైన నాయకుడని వెంకయ్యనాయుడు కొనియాడారు. నిష్ణాతుడైన జర్నలిస్టు, గొప్ప రచయిత అని ప్రశంసించారు.


More Telugu News