నైరుతి రుతుపవనాల రాకపై చల్లని కబురు చెప్పిన ఐఎండీ

  • జూన్ 1న రుతుపవనాల రాక
  • దేశంలో అత్యధిక వర్షపాతం ఇస్తున్న నైరుతి
  • ప్రస్తుతం బంగాళాఖాతంలో విస్తరించినట్టు ఐఎండీ వెల్లడి
భారత్ లో అత్యధిక శాతం వర్షపాతం నమోదయ్యేది నైరుతి రుతుపవనాల కారణంగానే! వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే ఈ రుతుపవనాల కోసం రైతన్నలు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. తాజాగా, నైరుతి రుతుపవనాల రాకపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆసక్తికరమైన సమాచారం వెల్లడించింది.

 జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళ వద్ద భారత్ ప్రధాన భూభాగంలో ప్రవేశిస్తాయని వివరించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని అత్యధిక ప్రాంతాల్లో విస్తరించాయి. మరో 48 గంటల్లో మాల్దీవులు-కొమరిన్ ప్రాంతంలోనూ రుతుపవనాలు ముందంజ వేస్తాయని ఐఎండీ పేర్కొంది. కాగా, అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది మరింత బలపడి గల్ఫ్ తీరం దిశగా పయనిస్తుందని వెల్లడించింది.


More Telugu News