బోరుబావిలో చిన్నారి మృతిపై స్పందించి కన్నీళ్లు పెట్టుకున్న పద్మాదేవేందర్‌రెడ్డి
- నిన్న మెదక్ జిల్లాలో ఘటన
- ఇలాంటి ఘటనలు మరోసారి జరగొద్దన్న పద్మ
- నీళ్లు పడని బోరుబావులను పూడ్చివేయాలి
మెదక్ జిల్లాలో నిన్న సాయంత్రం బోరుబావిలో పడిన మూడేళ్ల సాయివర్థన్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ జిల్లాలోని పాపన్నపేట మండలం పొడ్చన్ పల్లిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కన్నీరు కార్చారు.
ఇలాంటి ఘటనలు మరోసారి జరగొద్దని అన్నారు. నీళ్లు పడని బోరుబావులను రైతులు, స్థానిక అధికారులు పూడ్చివేయాలని కోరారు. కాగా, స్థానిక అధికారులు, రిగ్ యజమానుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని బాలల హక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఇటువంటి ఘటనలు జరిగినా చర్యలు తీసుకోలేదని చెప్పారు. అలాగే, సహాయక సిబ్బంది కూడా ఆపరేషన్‌లో సాంకేతిక పరికరాలు వాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.