ధోనీ రిటైర్ మెంట్ పై ట్వీట్ చేసి, డిలీట్ చేసిన సాక్షి... అప్పటికే స్క్రీన్ షాట్ వైరల్!
- ధోనీ రిటైర్ మెంట్ పై పతాకస్థాయిలో చర్చ
- లాక్ డౌన్ ప్రజలను పిచ్చి వాళ్లుగా మార్చేసిందన్న సాక్షి
- పలువురు అభ్యంతరం చెప్పడంతో ట్వీట్ డిలీట్
భారత స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ రిటైర్ మెంట్ పై పతాకస్థాయిలో చర్చ జరుగుతున్న వేళ, ఆయన భార్య సాక్షి పెట్టిన ఓ ట్వీట్ వైరల్ అయి, విమర్శలు కొనితేగా, ఆమె వెంటనే దాన్ని డిలీట్ చేశారు. అప్పటికే ఆ ట్వీట్ స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి.
2019లో వరల్డ్ కప్ తరువాత ధోనీ ఇంతవరకూ దేశం తరఫున బరిలోకి దిగని సంగతి తెలిసిందే. ఐపీఎల్ జరిగివుంటే, తనలోని సత్తాను మరోసారి చాటి ఆయన తిరిగి జట్టులోకి వచ్చి వుండేవాడని ఫ్యాన్స్ భావించారు. లాక్ డౌన్ కారణంగా ఐపీఎల్ వాయిదా పడగా, ధోనీ ఇక రాడనే వార్త సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ అయింది.
ఇక దీనిపై స్పందించిన సాక్షి, "అవన్నీ పుకార్లే. లాక్ డౌన్ ప్రజలను మానసికంగా అస్థిరత్వం పాలు చేసిందని నాకు అర్థమైంది" అని తన ట్విట్టర్ ఖాతాలో నిన్న రాత్రి 11.57 గంటల సమయంలో ట్వీట్ పెట్టారు. తన భర్త రిటైర్ మెంట్ వార్తలను ఆమె ఖండించినా, వాడిన భాష బాగాలేదని పలువురు అభ్యంతరం పెట్టారు. దీంతో ఆమె తన ట్వీట్ ను డిలీట్ చేశారు.