93 అంశాలపై చర్చ... నేడు కీలక నిర్ణయాలు తీసుకోనున్న టీటీడీ బోర్డు!
- వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశం
- దర్శనాల పునఃప్రారంభంపై విధి విధానాలు
- ఆర్థిక అంశాలే ప్రధాన అజెండాగా మీటింగ్
నేడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశం జరుగనుండగా, 93 అంశాలతో భారీ అజెండా సిద్ధమైంది. ఈ ఉదయం అన్నమయ్య భవనంలో వీడియో కాన్ఫరెన్స్ విధానంలో సమావేశం జరుగనుండగా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షత వహించనున్నారు. లాక్ డౌన్ కారణంగా దర్శనాలు ఆగిపోయిన తరువాత, ఆర్థిక లోటు ఏర్పడగా, ఆర్థికాంశాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందని సమాచారం.
లాక్ డౌన్ తరువాత భక్తులకు దర్శన విధానం, నిరర్ధక ఆస్తుల అమ్మకంపై విధానపరమైన నిర్ణయం, కొత్త సిబ్బంది నియామకం, వివిధ రాష్ట్రాల్లోని అనుబంధ దేవాలయాలకు నిధుల కేటాయింపు తదితర అంశాలపై చర్చించనున్న బోర్డు, కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోనుంది.