భారత్ పై ఇమ్రాన్ ఖాన్ అభ్యంతరకర వ్యాఖ్యలు!
- దురహంకారపూరిత విస్తరణా విధానం అమలు
- ఇండియాకు పొరుగుగా ఉన్న దేశాల్లో ఇబ్బందులు
- భారత్ ప్రమాదకారిగా మారిందన్న ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చైనాతో సరిహద్దుల వద్ద వివాదాలు పెరుగుతుండటంపై ఇమ్రాన్ స్పందించారు. ఇండియా ప్రభుత్వం దురహంకారపూరిత విస్తరణా విధానాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు.
అందువల్లే ఇండియాకు పొరుగుగా ఉన్న దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. దీనివల్ల ఇండియాతో సరిహద్దులను పంచుకుంటున్న దేశాలన్నింటికీ ముప్పేనని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇండియా తీసుకువచ్చిన పౌరసత్వ చట్టం, నేపాల్ తో సరిహద్దు వివాదం, ఫ్లాగ్ ఆపరేషన్ తదితరాలతో భారత్ ప్రమాదకారిగా మారిందని తన సోషల్ మీడియా ఖాతాలో వ్యాఖ్యానించారు.