రెండోసారి ప్లాస్మా దానం చేసిన నటి జోయా మోరానీ
- ఇటీవల కరోనా నుంచి కోలుకున్న జోయా
- తొలిసారి ఆమె ప్లాస్మాతో కరోనా నుంచి కోలుకున్న రోగి
- జోయాను ప్రశంసించిన మంత్రి ఆదిత్య థాకరే
బాలీవుడ్ ప్రముఖ నటి జోయా మొరానీ మరోమారు ప్లాస్మా దానం చేసి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల కరోనా బారినపడిన ఆమె చికిత్స అనంతరం కోలుకున్నారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ఆమె ఇటీవల తన ప్లాస్మాను దానం చేశారు. ఆమె చేసిన దానం కారణంగా ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తి కోలుకున్నాడు. ఈ నేపథ్యంతో తాజాగా మరోమారు ఆమె ప్లాస్మాను దానం చేశారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ముంబైలోని నాయర్ ఆసుపత్రిలో తాను రెండోసారి రక్తాన్ని దానం చేసినట్టు తెలిపారు.
కోవిడ్ నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరు రక్తాన్ని దానం చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నట్టు జోయా పేర్కొన్నారు. రక్తదానం వల్ల ఇతరులకు సాయం చేసిన వారు అవుతారని వైద్యులు తనతో చెప్పినట్టు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్లాస్మాను రెండోసారి దానం చేసిన జోయాను మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే ప్రశంసించారు. రక్తదానం చేయడానికి ధైర్యం, బలం అవసరమన్న థాకరే.. జోయాకు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.