రోడ్డు ప్రమాదంలో బుల్లితెర వర్ధమాన నటి మృతి.. షాక్‌లో కన్నడ టీవీ పరిశ్రమ
- స్వగ్రామానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- మోడల్‌గా కెరియర్ ప్రారంభించి టీవీ నటిగా ఎదిగిన వైనం
కన్నడ బుల్లితెర వర్ధమాన నటి మెబీనా మైఖేల్ (22) నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మోడల్‌గా కెరియర్ ప్రారంభించిన మెబీనా.. ప్యాటే హుదుగిర్ హళ్లీ లైఫ్ 4 రియాలిటీ షో టైటిల్ కైవసం చేసుకుని అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన ఆమె.. తాజా సడలింపుల నేపథ్యంలో స్వగ్రామం మెడికెరికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మంగళవారం ఆమె ప్రయాణిస్తున్న కారు దేవీహళ్లి వద్ద అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మెబీనాతోపాటు ఆమె స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం ఆమె మృతి చెందగా, మెబీనా స్నేహితులు కోలుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బెళ్లూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే కన్నడ టీవీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
విషయం తెలిసిన ప్యాటే హుదుగిర్ హళ్లీ లైఫ్ 4 రియాలిటీ షో హోస్ట్ అకుల్ బాలాజీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన ఫేవరెట్ కంటెస్టెంట్ మరణం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. చాలా చిన్న వయసులోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని, ఈ నిజాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మెబీనా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు ట్రోఫీ అందిస్తున్న ఫొటోను షేర్ చేశారు.