ఆర్థికంగా కుంగదీసినప్పటికీ పార్టీని వీడని కార్యకర్తలకు పాదాభివందనం: చంద్రబాబు

  • మహానాడులో ప్రసంగించిన చంద్రబాబు 
  • టీడీపీ 38 ఏళ్ల చరిత్రలో 22 ఏళ్లు అధికారంలో ఉంది
  • మరో 16 ఏళ్లు ప్రతిపక్షంలో ఉంది
  • వైసీపీ నేతలు ఉన్మాదుల మాదిరిగా వ్యవహరించారు
  • చేయని తప్పుకు టీడీపీ కార్యకర్తలు జైళ్లకు వెళ్తున్నారు
టీడీపీ 38 ఏళ్ల చరిత్రలో 22 ఏళ్లు అధికారంలో.. 16 ఏళ్లు ప్రతిపక్షంలో ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడులో పాల్గొన్న ఆయన అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.

'సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అనే బాటలో నడిచాం. కార్యకర్తలు భుజాలు అరిగిపోయేలా టీడీపీ జెండాలు మోశారు. టీడీపీ పథకాలు దేశానికే మార్గదర్శకమయ్యాయి. కుటుంబ సభ్యులు హత్యకు గురైనా పార్టీని వదలలేదని కార్యకర్తలు చెప్పారు. కార్యకర్తల త్యాగాలు మర్చిపోలేనివి

శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలని దెబ్బతీశారు. వైసీపీ నేతలు ఉన్మాదుల మాదిరిగా వ్యవహరించారు. చేయని తప్పుకు టీడీపీ కార్యకర్తలు జైళ్లకు వెళ్తున్నారు. బెదిరించి లొంగదీసుకునే కుట్రలు చేశారు. ఆర్థికంగా కుంగదీసినప్పటికీ పార్టీని వీడని కార్యకర్తలకు పాదాభివందనం' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాగా, గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ చేతిలో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే.


More Telugu News