పశ్చిమ గోదావరిలోని వేమవరంలో గ్యాస్ లీకేజీ.. గ్రామస్థులను ఖాళీ చేయించిన అధికారులు
- ఓ బోర్‌కు సిబ్బంది మరమ్మతులు చేస్తుండగా గ్యాస్ లీక్
- భారీ శబ్దాలు వచ్చిన వైనం
- భయాందోళనలకు గురైన గ్రామస్థులు
లాక్‌డౌన్ అనంతరం పరిశ్రమల్లో తిరిగి పనులు ప్రారంభమవుతున్న వేళ ఇటీవల పలు చోట్ల గ్యాస్ లీకేజీ ఘటనలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట మండలం వేమవరంలో ఈ రోజు ఉదయం ఓ చోట గ్యాస్ లీకేజీ కావడం అలజడి రేపింది. వేమవరంలో ఓ బోర్‌కు సిబ్బంది మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది.
అదే సమయంలో భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో గ్రామస్థులంతా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న అధికారులు గ్రామస్థులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.