24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా లక్ష కరోనా కేసుల నిర్ధారణ

  • మొత్తం కేసుల సంఖ్య 54,04,512 
  • మృతుల సంఖ్య 3,43,514
  • అమెరికాలో అత్యధికంగా 2,454,452 కేసులు
  • 1,43,739 మంది మృతి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. గత 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1,00,000 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 54,04,512కి చేరింది. అలాగే మొత్తం మృతుల సంఖ్య 3,43,514గా ఉంది. అమెరికాలో అత్యధికంగా 24,54,452 కేసులు నమోదుకాగా, 1,43,739 మంది ప్రాణాలు కోల్పోయారు.

అమెరికా తర్వాత బ్రెజిల్‌లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 3,90,000 కేసులు నమోదు కాగా, ఆ దేశంలో 24 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత రష్యాలో 3,62,000 మందికి కరోనా సోకగా, దాదాపు 3,500 మంది మృతి చెందారు. స్పెయిన్, యూకే, ఇటలీ, ఫ్రాన్స్‌లలో వరుసగా 2,83,000, 2,65,000, 2,30,000, 1,82,000 కేసులు నమోదయ్యాయి.


More Telugu News