వాకింగ్ చేసేటప్పుడు భౌతిక దూరం ఇలా పాటించాలి.. అవగాహన కల్పించిన పోలీసులు.. వీడియో ఇదిగో!
- లోధి గార్డెన్ లో అవగాహన కల్పించిన పోలీసులు
- మాస్కులు పెట్టుకోవాలని సూచన
- భౌతిక దూరం పాటిస్తూ వాకింగ్ చేసిన ప్రజలు
వాకింగ్ చేసేటప్పుడు భౌతిక దూరం పాటించాలని పార్కులో ఢిల్లీ పోలీసులు అవగాహన కల్పించారు. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రజలు నిబంధనలు పాటించేలా పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వారు ఈ రోజు ఉదయం లోధి గార్డెన్ లో ఇలా అవగాహన కల్పించారు.
మాస్కులు పెట్టుకోవాలని, వాకింగ్ చేసేటప్పుడు కూడా భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనని వారు మైకుల్లో చెప్పారు. దీంతో వాకింగ్ చేస్తోన్న వారంతా ఒకరినొకరు తాకకుండా దూరంగా ఉండి వాకింగ్ కొనసాగించారు. ఢిల్లీలో ఇప్పటివరకు 14 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.