టెక్నాలజీపై నా నమ్మకం మరింత పెరిగింది: చంద్రబాబు
- ఎలాంటి సమస్యలకైనా పరిష్కార మార్గం
- లాక్ డౌన్ తో ఈ సంవత్సరం డిజిటల్ మహానాడు
- కార్యకర్తలు పాల్గొనాలన్న చంద్రబాబునాయుడు
ఎటువంటి సమస్యలకైనా అందుబాటులో ఉన్న టెక్నాలజీ పరిష్కార మార్గాన్ని చూపిస్తుందన్న తన నమ్మకం మరోసారి బలపడిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. నేటి నుంచి పార్టీ మహానాడు కార్యక్రమం జరుగనుండగా, లాక్ డౌన్ సమయంలో భౌతిక దూరం పాటిస్తూ, డిజిటల్ సోషలైజేషన్ దిశగా సాగుతున్నామని, ఈ సంవత్సరం జరుగుతున్న డిజిటల్ మహానాడు కూడా అటువంటిదేనని తెలిపారు.
ప్రతి సంవత్సరమూ అసంఖ్యాకంగా వచ్చే నేతలు, కార్యకర్తల మధ్య సాగే మహానాడుకు ఈ సంవత్సరం నిబంధనలు అడ్డుగా నిలిచాయని అన్నారు. జూమ్ తమకు కొత్త మార్గాన్ని చూపిందన్నారు. ఇండియాలోనే తొలిసారిగా ఓ రాజకీయ సమావేశం డిజిటల్ మాధ్యమంగా సాగుతోందని వ్యాఖ్యానించిన ఆయన, టీడీపీకి చెందిన వారంతా తమ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లలో జూమ్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.