18 ఏళ్ల తరువాత హస్తినలో భానుడి రికార్డు

  • 2002లో సఫ్దర్ జంగ్ ప్రాంతంలో 46 డిగ్రీల వేడిమి
  • పాలమ్ లో 47.6 డిగ్రీల నమోదు
  • ఎండ వేడిమితో ప్రజలకు తీవ్ర అవస్థ
దేశ రాజధాని న్యూఢిల్లీలో 2002 తరువాత తొలిసారిగా ఉష్ణోగ్రత 46 డిగ్రీలను దాటింది. 1944, మే 29న సఫ్దర్ జంగ్ ప్రాంతంలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయిందని, ఆపై 2002, మే 19న ఇదే ప్రాంతంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, ఇప్పుడు అదే స్థాయిలో భానుడు నిప్పులు కురిపించాడని అధికారులు వెల్లడించారు. మంగళవారం నాడు సఫ్దర్ జంగ్ ప్రాంతంలో 46 డిగ్రీలు నమోదు కాగా, పాలమ్ ప్రాంతంలో అత్యధికంగా 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు.

ఎండ వేడిమి అధికంగా ఉండటంతో హస్తిన వాసులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాధారణంకన్నా అన్ని ప్రాంతాల్లో అధిక వేడిమి నమోదైంది. ఈ సంవత్సరం మే 19న 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, ఈ నెలంతా సాధారణం కన్నా అధిక వేడిని ప్రజలు చూశారని ఐఎండీ (ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్ - భారత వాతావరణ శాఖ) రీజనల్ ఫోర్ కాస్టింగ్ హెడ్ కుల్ దీప్ శ్రీవాత్సవ తెలియజేశారు. సఫ్దర్ జంగ్ ప్రాంతంలో ఆల్ టైమ్ రికార్డు 1944, మే 22న 47.2 డిగ్రీలుగా నమోదైందని ఆయన అన్నారు.


More Telugu News