హైదరాబాదులో అత్యవసరంగా ల్యాండైన ఎయిర్ ఏషియా విమానం
- విమానం నుంచి ఇంధనం లీక్
- ఓ ఇంజిన్ ఆపేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్
- తృటిలో తప్పిన ప్రమాదం
ఎయిర్ ఏషియా విమానయాన సంస్థకు చెందిన విమానం తృటిలో ప్రమాదం తప్పించుకుంది. జైపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ విమానం ల్యాండింగ్ ప్రయత్నంలో ఉండగా ఇంధనం లీకవుతున్నట్టు గుర్తించారు. దాంతో విమానంలోని ఒక ఇంజిన్ ను ఆపేసి, ఇక్కడి శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని కిందికి దింపారు. ఆ సమయంలో విమానంలో 70 మంది ప్రయాణికులున్నారు.
దీనిపై ఎయిర్ ఏషియా ప్రతినిధి స్పందిస్తూ, విమానంలో ఏర్పడ్డ లోపాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, ఘటనపై డీజీసీఏకి సమాచారం అందించామని తెలిపారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు దారితీసిన పరిణామాలపై జరుగుతున్న విచారణలో సహకరిస్తామని వెల్లడించారు.