ఆలయాలు తెరుస్తున్న తొలి రాష్ట్రంగా కర్ణాటక

  • జూన్ 1 నుంచి ఆలయాల్లో దర్శనాలు
  • వేడుకలు, జాతరలపై నిషేధం
  • జూలై 1 నుంచి స్కూళ్లు!
కరోనా దెబ్బ ఆధ్మాత్మిక రంగంపైనా తీవ్రంగానే పడింది. ప్రజలు ఎక్కువగా గుమికూడే అవకాశం ఉన్నందున ఆలయాలు, ప్రార్థన మందిరాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటివరకు ఆలయాల్లో పూజలు తప్ప దర్శనాల్లేవు.

అయితే, కర్ణాటక అన్ని రాష్ట్రాల కంటే ముందు ఆలయాలు తెరుస్తోంది. జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాలను తెరవాలని నిర్ణయించింది. త్వరలోనే దీనిపై మార్గదర్శకాలతో కూడిన ప్రకటన చేయనుంది. అయితే, ప్రజలు ఎక్కువగా వచ్చే అవకాశమున్నందున జాతరలు, ఇతర పండుగ వేడుకలపై మాత్రం నిషేధం విధించింది.

 కాగా, ఇదే రీతిలో స్కూళ్లను జూలై 1 నుంచి తెరవాలని కర్ణాటక భావిస్తోంది. దీనిపై స్పష్టత లేదు. మే 31తో కేంద్రం విధించిన లాక్ డౌన్ పూర్తవుతున్న నేపథ్యంలో, కేంద్రం తదుపరి ప్రకటనను పరిగణనలోకి తీసుకుని కర్ణాటక ప్రభుత్వం స్పందించే అవకాశాలున్నాయి.


More Telugu News