చెప్పినట్టే కరోనా వైరస్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన వర్మ!
- లాక్ డౌన్ రోజుల్లో కరోనా వైరస్ చిత్రం తెరకెక్కించిన వర్మ
- ఇవాళ సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేస్తానని వెల్లడి
- తమనెవరూ ఆపలేరంటూ ట్వీట్
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్రేడ్ మార్కుకు మరోసారి న్యాయం చేస్తూ, సమకాలీన సమస్య కరోనా మహమ్మారి నేపథ్యంలో కరోనా వైరస్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. లాక్ డౌన్ రోజుల్లో ఓ సినిమా తీయడం అనేది వర్మకే చెల్లుతుందని చెప్పాలి. అది కూడా కరోనాపైనే కావడం విశేషం.
ఇక ఈ సినిమా ట్రైలర్ ను ఈ సాయంత్రం రిలీజ్ చేశారు. ఓ కుటుంబంలో కరోనా ఎలాంటి ప్రభావం చూపిందన్నది కథాంశంగా తెలుస్తోంది. ఇంట్లో ఓ అమ్మాయి జలుబు, దగ్గుతో బాధపడుతుంటే తోబుట్టువులే పక్కన కూర్చునేందుకు జంకడం ఈ ట్రైలర్ లో చూడొచ్చు. మొత్తమ్మీద ఓ ఇంటికే పరిమితమైన కథతో వర్మ ఈ చిత్రాన్ని రూపొందించినట్టు అర్థమవుతోంది. ఈ సినిమాలో తెలిసిన ముఖాలు ఒక్కరూ లేరు. అంతా కొత్తవాళ్లే! అయితే ఈ చిత్రాన్ని వర్మ థియేటర్లలో రిలీజ్ చేస్తాడా, లేక, ఓటీటీ వేదికలపై రిలీజ్ చేస్తాడా? అన్నది చూడాలి.