ఓ సామాన్యుడి నిస్వార్థ సేవలకు హ్యాట్సాఫ్ చెప్పిన వీవీఎస్ లక్ష్మణ్

  • సదాశివపేటలో లారీడ్రైవర్లు, క్లీనర్ల కడుపు నింపుతున్న సామాన్యుడు
  • నిత్యం 180 మందికి భోజనం
  • దాచుకోకుండా ఇతరులకు పంచడం అద్భుతమన్న లక్ష్మణ్
కరోనా కష్టకాలంలో ఏ చిన్న సాయమైనా అది చాలా పెద్దదిగా అనిపిస్తోంది. ఇక లాక్ డౌన్ రోజుల్లో నిత్యం 180 మందికి భోజనం అందించడం అంటే  దేవుడే దిగివచ్చాడని చెప్పాలి. అలాగని అతడేమీ ధనికుడు కాదు, ఓ సామాన్యుడు. కానీ సాటి మనిషి కష్టాన్ని గుర్తించిన మానవతావాది. తెలంగాణలోని సదాశివపేట్ లోని నివసించే సయ్యద్ అంజాద్ పట్టణంలోని 180 మంది లారీ డ్రైవర్లకు, క్లీనర్లకు భోజనం సమకూర్చుతున్నారు. పది మందికి భోజనం అంటేనే ఎంతో కష్టమని భావిస్తున్న రోజుల్లో, వంద మందికి పైగా భోజనం అందిస్తూ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ను సైతం ఆకట్టుకున్నాడు.

ఈ అంశంపై లక్ష్మణ్ స్పందిస్తూ, అంజాద్, అతని కుటుంబం సదాశివపేటలోని లారీ డ్రైవర్లు, కీనర్లకు ఆహారం అందిస్తూ నిస్వార్థ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. పరిస్థితులు సవాల్ విసురుతున్న నేపథ్యంలో కూడా ఓ మామూలు వ్యక్తి అద్భుతమైన సేవలు అందించడం సాధారణమైన విషయం కాదని పేర్కొన్నారు. లాక్ డౌన్ రోజుల్లో ఎవరైనా సహజంగా దాచుకోవాలని చూస్తారని, కానీ అంజాద్ అతని కుటుంబసభ్యులు ఉన్నది ఇతరులకు పంచాలనుకోవడం సేవాతత్పరతకు నిదర్శనం అని ప్రశంసల వర్షం కురిపించారు.


More Telugu News