ధర్మ పరిరక్షణ కోసం దీక్షలు కొనసాగిస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు: పవన్ కల్యాణ్
- బీజేపీ నేతలతో పాటు జనసేన నేతల ఉపవాస దీక్షలు
- భూముల అమ్మకం ప్రయత్నాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది
- అయినప్పటికీ ఉపవాస దీక్ష కొనసాగుతుంది
తిరుమల శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయాలు తీసుకుంటోందంటూ బీజేపీ ఏపీ నేతలతో పాటు జనసేన నేతలు కూడా ఈ రోజు ఉపవాస దీక్షలు చేస్తున్నారు.
దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ... 'టీటీడీ భూముల అమ్మకం ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం ప్రస్తుతానికి ఉపసంహరించుకున్నప్పటికీ ధర్మ పరిరక్షణ కోసం ఉపవాస దీక్షని కొనసాగిస్తున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు' అని అన్నారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు బీజేపీతో కలిసి జనసేన ప్రారంభించిన ఈ దీక్షలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని చెప్పారు.
కాగా, తన నివాసం వద్ద తాను కూడా ఈ దీక్షల్లో పాల్గొంటున్నానని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఉపవాస దీక్ష ప్రారంభించేముందు వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఆయన పూజలు చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం ఆలయ భూములను అమ్మాలనుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు.