భారత్‌లోని తమ దేశీయులను తరలించేందుకు సిద్ధమైన చైనా

  • భారత్‌లో విపరీతంగా పెరిగిపోతున్న కేసులు
  • దేశంలో చిక్కుకున్న విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలను తరలించాలని నిర్ణయం
  • ప్రత్యేక విమానాల్లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచన
భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లోని తమ దేశీయులను స్వదేశానికి తరలించాలని నిర్ణయించింది. లాక్‌డౌన్ కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన చైనా విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలను వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలో స్వదేశానికి రావాలనుకుంటున్న వారు ప్రత్యేక విమానాల్లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. అయితే, అలా రావాలనుకున్న వారు క్వారంటైన్, ఇతర వైద్య పరమైన ఏర్పాట్లకు అంగీకరించాల్సి ఉంటుందని పేర్కొంది. కాగా, భారత్‌తో పాటు ఇతర దేశాల్లో చిక్కుకున్న చైనీయులను కూడా తరలించాలని జిన్‌పింగ్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, భారతదేశంలో అంతకంతకూ కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. ప్రస్తుతం అత్యధిక కేసులు కలిగిన దేశాల జాబితాలో భారత్ టాప్-10లోకి చేరడం ఆందోళన కలిగిస్తోంది.


More Telugu News