ఖైదీలను పెరోల్‌పై విడుదల చేస్తున్న ప్రభుత్వాలు.. యూపీలో 2,257 మంది బయటకు!

  • జైళ్లలో భౌతిక దూరం ఉండేలా చూడాలన్న సుప్రీంకోర్టు
  • తాత్కాలిక పెరోల్‌పై ఖైదీల విడుదల
  • 17 వేల మంది ఖైదీలను విడుదల చేసిన మహారాష్ట్ర
వివిధ నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న 2,257 మంది ఖైదీలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. జైళ్లలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా వీరిని విడుదల చేసింది. జైళ్లలో భౌతిక దూరం ఉండేలా చూసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఇందుకు మరో కారణం.

గత 8 వారాల్లో 2,257 మంది ఖైదీలను విడుదల చేసినట్టు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఫలితంగా జైళ్లలో ఖైదీల సంఖ్య గణనీయంగా తగ్గి భౌతిక దూరానికి మార్గం సుగమమైంది. మరోవైపు, మహారాష్ట్ర కూడా ఇలాంటి నిర్ణయాన్నే తీసుకుంది. ముంబై అర్థర్ రోడ్డు జైలులోని 150 మంది ఖైదీలకు కరోనా వైరస్ సోకడంతో అప్రమత్తమైన ప్రభుత్వం 17 వేల మంది ఖైదీలను తాత్కాలిక పెరోల్‌పై విడుదల చేసింది.


More Telugu News