హైదరాబాద్‌లో ప్రమాదకర స్థాయిలో యూవీ కిరణాలు!
- భూమిపైకి చేరుకుంటున్న అతినీలలోహిత కిరణాలు
- నగరాల యూవీ సూచికను రూపొందిస్తున్న డబ్ల్యూఈవో
- మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి
పెరుగుతున్న ఎండల మాటునే అతినీలలోహిత కిరణాలు (యూవీ) భూమిపైకి చేరుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా వీటి ప్రభావం హైదరాబాద్‌లో తీవ్రంగా ఉందని ప్రపంచ పర్యావరణ సంస్థ (డబ్ల్యూఈవో) ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం యూవీ కిరణాల స్థాయి ప్రమాదకర స్థాయికి చేరుకుందని పేర్కొంది. వేసవి ఎండలు పంజా విసురుతున్న నేపథ్యంలో మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది.
వివిధ నగరాల్లో యూవీ సూచికను రూపొందిస్తున్న డబ్ల్యూఈవో తాజాగా హైదరాబాద్‌లో యూవీ సూచిక ప్రమాదకరస్థాయికి చేరుకున్నట్టు పేర్కొంది. యూవీ కిరణాలు శరీరంపై పడితే అలర్జీలు, కళ్లకు సంబంధించిన సమస్యలు వస్తాయి. యూవీ కిరణాల కారణంగానే వేసవిలో చర్మ, కళ్ల సంబంధ సమస్యలతో వైద్యులను ఆశ్రయించే వారి సంఖ్య ఎక్కువని వైద్యులు కూడా చెబుతున్నారు.