'ఫ్రెష్'గా మరో వ్యాపారంలో సల్మాన్ ఖాన్!
- ప్రతి ఏడాది ఈద్ కు సల్మాన్ కొత్త సినిమా
- ఈ ఏడాది మాత్రం కొత్త బిజినెస్ ప్రారంభం
- 'ఫ్రెష్' పేరిట శానిటైజర్ విడుదల
- త్వరలోనే డియోడరెంట్స్, పెర్ ఫ్యూమ్స్
మామూలుగా ప్రతి ఏడాది ఈద్ పండుగకు తన కొత్త సినిమాను విడుదల చేసే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఈసారి సినిమాకి బదులుగా తన సొంత బ్రాండు శానిటైజర్ ను విడుదల చేశాడు. ఈ లాక్ డౌన్ సమయాన్ని ముంబై శివారులోని పాన్ వెల్ ఫాం హౌస్ లో గడుపుతున్న సల్మాన్ ఈ రోజు సోషల్ మీడియాలో ఈమేరకు ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
ఫ్రెష్ (FRSH) పేరుతో ఈ శానిటైజర్ ని మార్కెట్ కి విడుదల చేస్తున్నామని చెప్పాడు. ఈ బ్రాండుపై డియోడరెంట్ (దుర్గంధ నాశిని), పెర్ ఫ్యూమ్స్ (పరిమళ ద్రవ్యాలను)ను మార్కెట్ చేయాలనుకున్నామని, అయితే ప్రస్తుత పరిస్థితుల అవసరానికి తగ్గట్టుగా ముందుగా శానిటైజర్ ను రిలీజ్ చేస్తున్నామని సల్మాన్ చెప్పాడు.
ఇక బ్రాండ్ పేరైన 'ఫ్రెష్'ను FRSH గా రాయడంపై వివరణ ఇస్తూ, ఈవేళ there అన్న పదాన్ని thr అంటూ పేర్కొంటున్నప్పుడు Fresh ని FRSH అని ఎందుకు అనకూడదు? అంటూ జోక్ చేశాడు. త్వరలోనే డియోడరెంట్స్, పెర్ ఫ్యూమ్స్ విడుదల చేస్తామని, ఫ్రెష్ బ్రాండుపై వచ్చేవన్నీ మంచి నాణ్యతతో, సరసమైన ధరలతో ఉంటాయని చెప్పాడు. ఇదిలావుంచితే, సల్మాన్ ఇప్పటికే తన సొంత బ్రాండులపై రెడీమేడ్ దుస్తులు, ఈ-సైకిల్స్, జిమ్, ఫిట్ నెస్ పరికరాలను మార్కెట్ చేసే వ్యాపారంలో కూడా వున్నాడు.