కేవలం 3 గంటల్లో 2.4 లక్షల లడ్డూలు విక్రయించిన టీటీడీ

  • లాక్ డౌన్ తో తిరుమలలో దర్శనాలు నిలిపివేత
  • భక్తులకు లడ్డూ ప్రసాదాలు అందజేయాలని టీటీడీ నిర్ణయం
  • జిల్లా కేంద్రాల్లోని టీటీడీ కల్యాణమండపాల్లో విక్రయాలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దాంతో భక్తులకు కనీసం స్వామివారి ప్రసాదాన్నైనా అందించాలని భావించిన టీటీడీ రాష్ట్రవ్యాప్తంగా లడ్డూలు విక్రయిస్తోంది. నేడు విక్రయాలు ప్రారంభం కాగా కేవలం 3 గంటల్లోనే 2.4 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయి.

గుంటూరు మినహా 12 జిల్లాల్లో లడ్డూ ప్రసాదాలు విక్రయించారు. గుంటూరులో టీటీడీ కల్యాణమండపం రెడ్ జోన్ లో ఉన్నందున అక్కడ అమ్మకాలు చేపట్టలేదు. గుంటూరులో ఈ నెల 30 నుంచి లడ్డూ ప్రసాదాలు విక్రయిస్తారు. రేపు మరో 2 లక్షల లడ్డూలు జిల్లా కేంద్రాలకు తరలించనున్నారు. కాగా, లడ్డూలు విక్రయించాలని తెలంగాణ, తమిళనాడు భక్తుల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి. దాంతో, తమిళనాడుకు లక్ష, తెలంగాణకు 50 వేల లడ్డూలు పంపాలని టీటీడీ యోచిస్తోంది.


More Telugu News