చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడి వ్యాఖ్యలను సమర్థించిన పవన్ కల్యాణ్
- వివాదాస్పదంగా మారిన శ్రీవారి ఆస్తుల అమ్మకం
- ఏపీ ధార్మిక పరిషత్ ను పునరుద్ధరించాలన్న రంగరాజన్
- చిలుకూరు అర్చకుడి ట్వీట్ ను పంచుకున్న పవన్
శ్రీవారి ఆస్తుల అమ్మకం అంశంలో జనసేనాని పవన్ కల్యాణ్ సైతం గట్టిగా గళం వినిపిస్తున్నారు. తాజాగా చేసిన ట్వీట్ లో ఆయన ఆసక్తికర ప్రతిపాదన చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ చెప్పినట్టుగా ఏపీ ధార్మిక పరిషత్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఏపీ ధార్మిక పరిషత్ అంశంలో ట్వీట్ ను కూడా పంచుకున్నారు.
2014లో ఏపీ ధార్మిక పరిషత్ ను రద్దు చేశారని, ఇప్పుడు ఆ పరిషత్ ను పీఠాధిపతులు, విశిష్ట భక్తులతో పునరుద్ధరించాలని ఆ ట్వీట్ లో రంగరాజన్ కోరారు. తిరుమల శ్రీవారి ఆలయం సహా అనేక హిందూ దేవాలయాలను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు తగిన పరిష్కారం ఆలోచించడానికి ఏపీ ధార్మిక పరిషత్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అంతేకానీ, దాతలు విరాళాల రూపంలో అందించిన ఆస్తులను అమ్మి సొమ్ము చేసుకోవాలనుకోవడం సరైన వైఖరి కాదని రంగరాజన్ స్పష్టం చేశారు.