హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో అమరావతికి పయనమైన చంద్రబాబు

  • విమాన సర్వీసుల్లో జాప్యంతో విశాఖపట్నం వెళ్లలేకపోతోన్న చంద్రబాబు
  • కాసేపట్లో ఉండవల్లిలోని తన నివాసానికి టీడీపీ అధినేత
  • ఈ నెల 27, 28వ తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమాల్లో ప్రసంగం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతికి వెళ్లడానికి అనుమతి లభించిన నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి ఆయన బయలుదేరారు. జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన అమరావతి వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విమానాల ప్రారంభం రెండు రోజుల పాటు ఆలస్యం కావడంతో ఆయన విశాఖపట్నం వెళ్లలేకపోతోన్న విషయం తెలిసిందే.

విమాన సేవలు అందుబాటులో ఉంటే ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు చేరుకునే వారు. అనంతరం వెంకటాపురం గ్రామంలో మృతుల కుటుంబాలను పరామర్శించేవారు. ఆ తర్వాత ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటన ప్రాంతాల్లో పర్యటించాలని ఆయన అనుకున్నారు.

షెడ్యూలులో మార్పుల కారణంగా ఆయన ముందు అమరావతికి వెళ్తున్నారు. రోడ్డు మార్గంలో ఆయన కాసేపట్లో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. ఈ నెల 27, 28వ తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమాల్లో ఆయన మంగళగిరి సమీపంలోని ఎన్టీఆర్‌ భవన్‌ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.


More Telugu News