అమెరికాలో మహమ్మారి ఉద్ధృతి తగ్గుతోంది.. వెల్లడించిన ట్రంప్

  • 50 శాతానికి తగ్గిన కరోనా కేసులు
  • కేసులు నెమ్మదిస్తున్నాయన్న ట్రంప్
  • ఇప్పటి వరకు అమెరికాలో  98,024 మంది బలి
అమెరికాను అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారి క్రమంగా నెమ్మదిస్తోంది. కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గుతున్నట్టు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య 50 శాతానికి తగ్గినట్టు కరోనా నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్న వైట్‌హౌస్ అధికారి డెబొరా బిరెక్స్ ఇటీవల తెలిపారు.

ఇప్పుడు ట్రంప్ స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రజలకు కొంత ఊరట లభించినట్టయింది. కాగా, అమెరికాలో ఇప్పటి వరకు 16,77,356 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 98,024 మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 3,41,718 మంది కోలుకోగా, ఇంకా 12,37, 614 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.


More Telugu News