వీడిన ఉత్కంఠ... రేపు విశాఖ వెళ్లేందుకు చంద్రబాబుకు అనుమతి ఇచ్చిన ఏపీ డీజీపీ
- గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించాలని చంద్రబాబు నిర్ణయం
- వెంటనే అనుమతి జారీ చేసిన తెలంగాణ డీజీపీ
- చంద్రబాబు అభ్యర్థనను ఏపీ డీజీపీ పెండింగ్ లో ఉంచినట్టు ప్రచారం
- ఎట్టకేలకు అనుమతి రావడంతో చంద్రబాబు పర్యటన ఖరారు
టీడీపీ అధినేత చంద్రబాబు రేపు విశాఖలో పర్యటించేందుకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అనుమతి మంజూరు చేశారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో పర్యటించాలని, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీ డీజీపీలను అనుమతి కోరారు.
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వెంటనే స్పందించి అనుమతి జారీ చేయగా, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాత్రం పెండింగ్ లో పెట్టినట్టు కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు ఏపీ డీజీపీ నుంచి కూడా అనుమతి రావడంతో రేపు చంద్రబాబు విశాఖ పర్యటనపై ఉత్కంఠ వీడింది. సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి వైజాగ్ బయల్దేరనున్నారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించిన అనంతరం చంద్రబాబు విశాఖ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో అమరావతి చేరుకుంటారు.