ప్రగతి భవన్ లో పారిశుద్ధ్య పనులు చేసిన కేటీఆర్
- "10 గంటలకు 10 నిమిషాలు" అంటూ పిలుపునిచ్చిన కేటీఆర్
- పరిసరాల పరిశుభ్రతపై అవగాహన
- కేటీఆర్ స్వయంగా పాల్గొన్న వైనం
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రగతి భవన్ లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. తాను పిలుపునిచ్చిన "ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు" పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో కేటీఆర్ స్వయంగా పాల్గొన్నారు. ప్రగతి భవన్ లో ఉన్న ఓ తొట్టెలో మురుగు నీరు నిల్వ ఉండడాన్ని గుర్తించి శుభ్రం చేశారు. పలు కుండీల్లో చెత్తను శుభ్రం చేశారు. ప్రగతి భవన్ ప్రాంగణంలోని చెత్తను కూడా ఏరివేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.
కాగా, కేటీఆర్ పిలుపు మేరకు మంత్రులు, ఇతరు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించి, ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సీజనల్ వ్యాధుల నివారణే ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమం చేపట్టారు.