వరంగల్ గొర్రెకుంట బావి ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు!
- ఒకే బావిలో 9 మృతదేహాలు
- సంచలనం సృష్టించిన ఘటన
- కొనసాగుతున్న పోలీసు దర్యాప్తు
వరంగల్ శివారు ప్రాంతం గీసుకొండలో గొర్రెకుంట బావిలో 9 మృతదేహాలు కనిపించడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఆ కేసులో మిస్టరీ వీడలేదు. అయితే, ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వారిలో ఒకరైన యాకూబ్... మృతురాలు బుస్రా ఖాతూన్ ప్రియుడిగా భావిస్తున్నారు. మరో ఇద్దరు సంజయ్ కుమార్, మంకు షా బీహార్ కు చెందిన కార్మికులు. కాగా, శనివారం ఉదయం సంజయ్ కుమార్, మంకు షాలను పోలీసులు బావి వద్దకు తీసుకువచ్చి మరోసారి క్రైమ్ సీన్ పై అంచనావేశారు.
అటు, ఎంజీఎం ఆసుపత్రి నుంచి మృతదేహాల పోస్టుమార్టం నివేదిక వచ్చింది. అందరూ బావిలోనే ప్రాణాలు విడిచినట్టు ఆ నివేదికలో పేర్కొన్నారు. ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్లే మృతి చెందినట్టు వెల్లడైంది. అయితే వారి ఉదర భాగాల నుంచి సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ విభాగం పరీక్షిస్తోంది. ఈ నివేదిక వస్తే, వారేమైనా విష ప్రభావానికి గురయ్యారా అనేది తేలనుంది.
ఈ ఘటనలో మొత్తం 9 మంది చనిపోగా, వారిలో ఏడుగురికి చెందిన సెల్ ఫోన్లు కనిపించకపోవడంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. పోలీసుల్లో ఓ బృందం సెల్ ఫోన్ల కోసం గాలిస్తోంది. మక్సూద్, ఆయన కుమార్తె బుస్రా ఖాతూన్ ల ఫోన్ కాల్ డేటాను కూడా మరో పోలీసు బృందం పరిశీలిస్తోంది.