దేవాలయ ఆస్తుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోము: కన్నా లక్ష్మీ నారాయణ

  • జీవో 39, టీటీడీ, సింహాచలం భూముల కోసం పోరాడతాం
  • మంగళవారం ధర్నాలు చేస్తాం
  • చాలా మంది భక్తులు స్వామివారిపై భక్తితో భూములు ఇచ్చారు
  • భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. జీవో 39, తిరుమల తిరుపతి దేవస్థానం, సింహాచలం భూముల రక్షణ కోసం పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ...  వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం ధర్నాలు చేస్తామని ప్రకటించారు. దేవాలయ ఆస్తుల జోలికి వస్తే తాము చూస్తూ ఊరుకోబోమని ఆయన చెప్పారు.  చాలా మంది భక్తులు దేవుడిపై భక్తితో టీటీడీకి భూములు ఇచ్చారని, ఇప్పుడు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా టీటీడీ పాలక వర్గం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.

దేవాలయాల భూములు గజం అమ్మినా తమ పార్టీ పోరాటం చేస్తుందని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. సింహాచలం భూములు కబ్జాకు ఎలా గురయ్యాయని ఆయన ప్రశ్నించారు. కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జీవో నంబరు 39పై అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు.


More Telugu News