మహిళల మధ్య నీటి గొడవ రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసిన వైనం.. వాహనాలు ధ్వంసం
- చిత్తూరు జిల్లాలో ఘటన
- నక్కలదిన్నె వడ్డేపల్లి, కేవీపల్లె నూతనకాల్వ గ్రామాల మధ్య ఉద్రిక్తత
- రాళ్లు, బీరు సీసాలతో దాడులు
నీటి సమస్యపై మహిళల మధ్య ప్రారంభమైన గొడవ రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం నక్కలదిన్నె వడ్డేపల్లి, కేవీపల్లె నూతనకాల్వ గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నీళ్లు తెచ్చుకునే క్రమంలో ఇరు గ్రామాల మహిళలు మొదట తగాదాకు దిగారు. అనంతరం క్రమంగా ఇరు గ్రామాల ప్రజలు పరస్పరం గొడవ పడి దాడులు చేసుకునేవరకు వెళ్లింది. రాళ్లు, బీరు సీసాలతో దాడులు చేసుకున్నారు. బైక్లకు నిప్పంటించుకున్నారు. ఈ ఘర్షణలో పలు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితులను అదుపు చేశారు.