మహా ప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూను మార్కెట్లో పెడతారా?: దేవినేని ఉమ

  • నాడు ఏడుకొండలెందుకు రెండుకొండలు చాలన్నారు
  • నేడు కలియుగ దైవం వెంకన్న భూములు వేలానికా?
  • కోట్లాది మంది భక్తుల, దాతల మనోభావాలు దెబ్బతీశారు
  • ఆ హక్కు మీకు, మీబాబాయ్ కి ఎవరిచ్చారు?
టీటీడీ భూములు వేలం వేయడమేంటని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు ప్రశ్నించారు. 'నాడు ఏడుకొండలెందుకు రెండుకొండలు చాలన్నారు. నేడు కలియుగ దైవం వెంకన్న భూములు వేలానికా? భక్తులు మహా ప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూను మార్కెట్లో పెడతారా?   కోట్లాది మంది భక్తుల, దాతల మనోభావాలు దెబ్బతీసే హక్కు మీకు, మీబాబాయ్ కి ఎవరిచ్చారు? మీ నిర్ణయాలను వెంటనే వెనక్కితీసుకోండి వైఎస్ జగన్  గారు' అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా పలు పత్రికల్లో వచ్చిన వార్తలను పోస్ట్ చేశారు. టీటీడీకి ఎటువంటి ఉపయోగం లేనివాటిని గుర్తించి విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వాటిల్లో ఉంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న 53 ఆస్తులను కూడా గుర్తించి అవి విక్రయానికి తగినవా? కావా? అని నిర్ణయించడానికి ఓ సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారని వాటిల్లో పేర్కొన్నారు.



More Telugu News