ఢిల్లీలో ఓ సీనియర్ డాక్టర్ ను కబళించిన కరోనా

  • కరోనాతో డాక్టర్ జితేంద్ర నాథ్ పాండే మృత్యువాత
  • పాండే ఎయిమ్స్ పల్మనాలజీ విభాగం డైరెక్టర్
  • నిన్న ఎయిమ్స్ మెస్ వర్కర్ కరోనాతో మృతి
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ముందుండి పోరాడుతున్న వైద్యుల ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోతోంది. తాజాగా, దేశ రాజధాని ఢిల్లీలో ఓ సీనియర్ వైద్యుడు కరోనాతో మృతి చెందడం వైద్య వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.

 ఢిల్లీలోని ఎయిమ్స్ లో పల్మనాలజీ విభాగం డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న డాక్టర్ జితేంద్రనాథ్ పాండే కరోనాతో ఇవాళ మృత్యువాత పడ్డారు. డాక్టర్ పాండే వయసు 78 సంవత్సరాలు. డాక్టర్ పాండే కరోనాతో చనిపోయినట్టు మరో సీనియర్ డాక్టర్ సంగీతా దేవి తెలిపారు. అటు, ఎయిమ్స్ మెస్ లో పనిచేసే ఓ వ్యక్తి నిన్న కరోనాతో మృతి చెందాడు. మెస్ లో సరైన రక్షణాత్మక చర్యలు తీసుకోవడంలేదంటూ రెసిడెంట్ డాక్టర్ల సంఘం ఎయిమ్స్ డైరెక్టర్ లేఖ రాసిన మరుసటి రోజే డాక్టర్ పాండే మృతి చెందడం ఇతర డాక్టర్లను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.


More Telugu News