మమతా బెనర్జీ విన్నపంపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- పశ్చిమ బెంగాల్ ను అతలాకుతలం చేసిన తుపాన్
- సహాయక చర్యలకు సైన్నాన్ని పంపాలని కోరిన దీదీ
- 5 కాలమ్స్ సైన్యాన్ని పంపిన కేంద్రం
ఎంఫాన్ తుపాను పశ్చిమబెంగాల్ ను అతలాకుతలం చేసింది. ఈ నేపథ్యంలో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సైన్యాన్ని పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. ఆమె విన్నపాన్ని కేంద్రం మన్నించింది.
మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనుల కోసం 5 కాలమ్స్ సైన్యాన్ని పంపింది. వీటిలో 3 కాలమ్స్ ను కోల్ కతాకు, మరో 2 కాలమ్స్ ను ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలకు పంపించింది. అధికార యంత్రాంగానికి ఈ సైన్యం ఉపయోగపడుతుంది. ఒక్కొక్క కాలమ్ లో 35 మంది సైనికులు ఉంటారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 26 బృందాలు పని చేస్తున్నాయి. అదనంగా మరో 10 బృందాలను పంపిస్తున్నట్టు ఎన్డీఆర్ఎఫ్ ప్రకటించింది.